నీట్ పేపర్ లీక్ కేసు.. తెలంగాణ సీఐడీ సహకారం కోరిన సీబీఐ

ఎంసెట్ కేసులో 200 మందికిపైగా విద్యార్థులకు ముందే పేపర్ లీక్ చేసింది బీహారీ గ్యాంగ్. నీట్ పరీక్ష పేపర్ లో ఇదే తరహాలో లీక్ చేసింది బీహారీ గ్యాంగ్.

నీట్ పేపర్ లీక్ కేసు.. తెలంగాణ సీఐడీ సహకారం కోరిన సీబీఐ

NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ సీఐడీ సహకారం కోరింది సీబీఐ. 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ అయ్యింది. తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ కేసులో బీహారీ గ్యాంగ్ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసులోనూ బీహారీ గ్యాంగ్ కీలక పాత్ర పోషించింది. రెండు కేసులకు సారూప్యత ఉండటంతో సీఐడీ నుంచి వివరాలు తీసుకుంటున్నారు సీబీఐ అధికారులు.

ఎంసెట్ కేసులో 200 మందికిపైగా విద్యార్థులకు ముందే పేపర్ లీక్ చేసింది బీహారీ గ్యాంగ్. నీట్ పరీక్ష పేపర్ లో ఇదే తరహాలో లీక్ చేసింది బీహారీ గ్యాంగ్. ఎంసెట్ పేపర్ లీకేజీ కేసు నిందితుల వివరాలను సీఐడీ నుంచి సేకరిస్తోంది సీబీఐ. నీట్ పరీక్ష పేపర్ లీక్ దేశంలో తీవ్ర సంచలనంగా మారింది.

నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో 10మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ అధికారులు 83మందిని అరెస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో చార్జిషీటు కూడా దాఖలు చేశారు. 2016లో తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పేపర్ ఏ విధంగా లీక్ అయ్యిందో.. అదే తరహాలో నీట్ పరీక్ష కూడా లీక్ అయినట్లు సీబీఐ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే సీబీఐ అధికారులు తెలంగాణ సీఐడీ అధికారుల సహకారం తీసుకున్నారు.

గతంలో ఎంసెట్ పేపర్ లీక్ స్కామ్ కు సంబంధించిన వివరాలు కావాలని సీబీఐ అధికారులు సీఐడీ పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఎంసెట్ పేపర్ లీక్ కేసులో బీహారీ గ్యాంగ్ పాత్ర ఉందని, సింగ్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నాడు, అతడు ఎక్కడి నుంచి పేపర్స్ తీసుకొచ్చాడు? ఎవరెవరు ఏజెంట్లుగా ఉన్నారు? ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారు? ఈ వివరాలన్నీ సీబీఐ అధికారులు కోరారు.

Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?