Bride Escaped: హైద‌రాబాద్‌లో న‌వ వ‌ధువు అదృశ్యం

వారు తమ వద్దకు రాలేదని చెప్పడంతో భర్త, అతడి తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Bride Escaped: హైద‌రాబాద్‌లో న‌వ వ‌ధువు అదృశ్యం

Bride Escape

Updated On : June 24, 2021 / 3:49 PM IST

Bride Escaped: నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నవవధువు అదృశ్యమైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ యువతి (20)కి అడిక్‌మెట్ కు చెందిన యువకుడితో గత నెల 30వ తేదీన వివాహం జరిగింది. కాగా ఈ నెల 22వ తేదీన ఎవరికి చెప్పకుండా బట్టలు, బంగారం తీసుకోని అత్తగారింట్లోంచి వెళ్ళిపోయింది.

భార్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు భర్త.. అత్తమామలకు ఫోన్ చేశాడు. వారు తమ వద్దకు రాలేదని చెప్పడంతో భర్త, అతడి తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.