తెలంగాణ స్టూడెంట్స్‌ ఆన్‌లైన్ క్లాసులకు నయా గైడ్‌లెన్స్

తెలంగాణ స్టూడెంట్స్‌ ఆన్‌లైన్ క్లాసులకు నయా గైడ్‌లెన్స్

Updated On : August 25, 2020 / 7:01 PM IST

తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 1నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైపోతుంది. నర్సరీ నుంచి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల వరకూ ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయని కన్ఫామ్ చేసేశారు అధికారులు. మరి ఆ క్లాసులు ఎంతసేపు జరగాలి.. ఎన్ని గంటలు జరగాలనే దానిపైనా గైడ్ లెన్స్ రిలీజ్ చేసేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులపై మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యార్థులందరికీ 35నుంచి 45 నిమిషాల పాటు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలి. వాటిని రోజుల వారీగా తరగతులను బట్టి ఒక్కోరకంగా ఉన్నాయి. నర్సరీ, ఎల్కేజీ విద్యార్థులకు రోజుకు 2క్లాసులు అంటే అలా వారం మొత్తంలో కేవలం మూడు రోజులు మాత్రమే క్లాసులు బోధించాలి. 1నుంచి 5వ తరగతి వరకూ రోజుకు రెండుక్లాసులు.
6నుంచి 8వ తరగతి వరకూ రోజుకు రెండు క్లాసులు, 9నుంచి ఇంటర్మీడియట్ వరకూ 35నుంచి నిమిషాల పాటు క్లాసులు నిర్వహించాలని గైడ్‌లైన్స్ ఇష్యూ చేశారు.