Ration Cards : ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన లబ్దిదారులందరికీ

Ration Cards : ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు

Ration Cards

Updated On : July 15, 2021 / 9:18 PM IST

Ration Cards : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన లబ్దిదారులందరికీ జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన వారు 3లక్షల 60వేలకు పైగా ఉన్నారు. వారందరికి మంత్రులు, ఎమ్మెల్యేలు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. జూలై 26 నుంచి 31 వరకు రేషన్‌కార్డుల పంపిణీ నిర్వహించాలని అధికారులతో కేసీఆర్‌ చెప్పారు. ఇక కొత్త రేషన్ కార్డు అందుకున్న వారికి ఆగస్టు నుంచే బియ్యం పంపిణీ జరగనుంది.