Gandhi Hospital : గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్

గాంధీ ఆసుపత్రి అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో బాధిత మహిళ ఇష్టపూర్తిగానే అతడితో గడిపినట్లు పోలీసులు నిర్దారించారు.

Gandhi Hospital : గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్

Gandhi Hospital

Updated On : August 19, 2021 / 1:45 PM IST

Gandhi Hospital : గాంధీ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార గత రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే.. ఘటన అనంతరం ఆసుపత్రి నుంచి మిస్సైన మహిళ ఆచూకీ లభించింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆ మహిళ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె ఇష్టపూర్వకంగానే ఓ వ్యక్తితో రెండు రోజులపాటు ఉన్నట్లు విచారణలో తెలిపింది.

ఇక ఆమె పై ఎటువంటి మత్తు ప్రయోగం జరగలేదని వైద్య పరీక్షల్లో తేలింది. ఇక ఈ కేసులో అనుమానితులను నిర్దోషిలుగా తేల్చే అవకాశం ఉంది.
కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన సంచలనం రేపింది. పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. నాలుగు రోజులపాటు మహిళకోసం గాలించిన గురువారం ఆమె ఆచూకీ కనిపెట్టారు. ఆమెతోపాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.