నో సెలబ్రేషన్స్‌.. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం!

నో సెలబ్రేషన్స్‌.. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం!

Updated On : December 26, 2020 / 8:00 AM IST

New Year Celebrations Ban in Hyderabad City : మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా? న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకుంటున్నారా? డీజేలు పెట్టుకుని ధూంధాం చేద్దామనుకుంటున్నారా? అయితే ఆ ఆలోచన విరమించుకోండి. నగరంలో న్యూ ఇయర్ వేడుకలను పోలీసులు నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే తాటతీస్తామంటున్నారు. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలను నిషేధించింది ప్రభుత్వం. పబ్‌లో ధమ్‌ మారో ధమ్‌ అంటూ తెల్లవారే దాకా తెగ తాకే వారికి చెక్ పడింది. అర్ధరాత్రి హ్యాపీ న్యూయర్ అంటూ వాహనాలపై రయ్‌మని దూసుకుపోతామనుకుంటే పోలీసులు తాట తీస్తారు.

ఈవెంట్స్‌ పేరుతో రచ్చరంబోలా చేద్దామనుకుంటే ఖాకీల ప్రతాపానికి గురికాక తప్పదు. యూకే నుంచి తెలంగాణకు వచ్చినవారిలో కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో కొత్త సంవత్సర ఉత్సవాలను పోలీసులు బ్యాన్ చేశారు. రిసార్ట్స్‌, పబ్స్‌, హోటల్స్‌తో పాటు.. గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోనూ నిషేధం విధించారు. వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. డిసెంబర్‌ థర్టీ ఫస్ట్ రోజు డ్రంకెన్‌ డ్రైవ్ నిర్వహిస్తామని.. రూల్స్‌ బ్రేక్‌ చేస్తే యాక్షన్‌ తప్పదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

న్యూ ఇయర్ పేరుతో ఎవరైనా న్యూసెన్స్‌ క్రియేట్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచించారు. హైదరాబాద్‌లోనే కాదు జిల్లాల్లోనూ ఇలాంటి ఆంక్షలే అమలు చేసే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ కొత్త సంవత్సర వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగతాయని సీపీ సజ్జనార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేటాయించిన సమయంలోనే పబ్ లకు అనుమతించనున్నట్టు తెలిపారు. ఫంక్షన్ హాళ్లు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్లలోనూ నిషేధం విధించినట్టు చెప్పారు. రిసార్ట్స్, పబ్బులు, స్టార్ హోటళ్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు సజ్జనార్ చెప్పారు. న్యూఇయర్ పేరుతో ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోనే కాదు.. జిల్లాల్లోనూ ఇలాంటి ఆంక్షలను అమలు చేసే అవకాశం ఉంది.