ఓఆర్ఆర్ బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు

ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఇరువైపుల ఉన్న 15 మీటర్ల బఫర్ జోన్ ఏరియాలో ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు జరుపకూడదని హైదరాబాద్ మెట్రో పాలిజన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిసరాల్లో ఉన్న భూముల యజమానులను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు బఫర్ జోన్ లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఉన్నాతికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఓఆర్ఆర్ ప్రాజెక్టు భూసేకరణ చేయని ప్రైవేట్ భూ యజమానులు ఓఆర్ఆర్ వెంట కచ్చితంగా బఫర్ జోన్ నిబంధనలను పాటించాల్సిందేనని హెడ్ ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ స్పష్టం చేశారు. బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 15 మీటర్ల సెట్ బ్యాక్ నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 470ను ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు, డెవలపర్స్, ప్రభుత్వ స్థానిక సంస్థలు తప్పనిసరి పాటించాలని ఆదేశించారు.
అంతేకాకుండా నిర్ధేశించిన బఫర్ జోన్ లో హోర్డింగ్స్, యూనిఫోల్స్, టెలీకాం టవర్స్, పవర్ ట్రాన్స్ ఫార్మరర్లు, డిష్ యాంటీనాలు కూడా ఉండటానికి వీల్లేదన్నారు. ఇక బఫర్ జోన్ పరిధిలోని కాంపౌడ్ వాల్, బార్కిండింగ్ షీట్స్ వెంటనే గుర్తించి సబంధిత అధికారులు చర్యలు తీసుకునే విధంగా పర్యవేక్షణ ఆదేంచాలన్నారు.