ఆ ఎమ్మెల్యేకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ఇప్పటివరకు ఎంత మంది కాంగ్రెస్‌లో చేరారంటే..?

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు.

ఆ ఎమ్మెల్యేకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ఇప్పటివరకు ఎంత మంది కాంగ్రెస్‌లో చేరారంటే..?

Congress Operation Akarsh: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా, ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకునేందుకు కూడా సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. లైన్ క్లియర్ కావడంతో ఆయన కూడా త్వరలో హస్తం గూటికి చేరనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
1. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
2. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
3. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
4. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
5. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావు
6. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

Also Read : అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను.. ఎలాంటి కండిషన్లు పెట్టలేదు: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
1. దండే విఠల్ (ఆదిలాబాద్ లోకల్ బాడీ)
2. భాను ప్రసాద్ (కరీంనగర్ లోకల్ బాడీ)
3. ఎం. ఎస్ ప్రభాకర్ (రంగారెడ్డి లోకల్ బాడీ)
4. ఎగ్గే మల్లేష్ (ఎమ్మెల్యే కోటా)
5. బొగ్గవరపు దయానంద్ (గవర్నర్ కోట)
6. బస్వరాజు సారయ్య (గవర్నర్ కోట)