Padi Kaushik Reddy : అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై.. గచ్చిబౌలి పీఎస్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు
ఈటల రాజేందర్ వెనకుండి ఈ తతంగం నడిపిస్తున్నాడని ఆరోపించారు. "రాజేందర్ నీకు చిత్తశుద్ధి ఉంటే పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసి చెబుదాం" అని సవాల్ చేశారు.

Padi Kaushik Reddy
YouTube Channels Falsehood : సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ లో ప్రచారం చేసిన వాయిస్ తనది కాదని అన్నారు. తప్పుడు ప్రచారం చేసి తనను మానసిక వేదనకు గురిచేసిన యూట్యూబ్ ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తీన్మార్ మల్లన్న ఛానల్స్ లో ప్రసారం చేసినవి ఫేక్ వార్తలు అని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ వెనకుండి ఈ తతంగం నడిపిస్తున్నాడని ఆరోపించారు. “రాజేందర్ నీకు చిత్తశుద్ధి ఉంటే పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసి చెబుదాం” అని సవాల్ చేశారు. ముదిరాజ్ బిడ్డలంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. తాను అనని మాటని అన్నట్లు దుష్ప్రచారం చేయడం అన్యాయం అన్నారు.
ముదిరాజ్ బిడ్డల్ని తిట్టినట్లు అసత్య ప్రచారం చేయడం వెనక ఈటెల రాజేంద్ర హస్తం ఉందని ఆరోపించారు. ఫేక్ ఆడియో క్రియేట్ చేసి దాన్ని తెలంగాణ వ్యాప్తంగా వైరల్ చేశారని పేర్కొన్నారు. ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని.. లేనిది ఉన్నట్లు క్రియేట్ చేశారని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానల్ లో ప్రచారం చేసినవన్నీ అవాస్తవం అన్నారు.