Trains Cancelled: ఆగస్టు 6వ తేదీ వరకు ఆ ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు.. 22 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ..
వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Passenger trains
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా వివిధ రైళ్లను ఈనెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం రైల్వే అధికారులు ప్రకటించారు. తాజాగా ఆ రైళ్ల రద్దును ఆగస్టు 6వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
రద్దయిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే..
కాజీపేట – డోర్నకల్ మధ్య నడిచే డోర్నకల్ పుష్‌పుల్ రైలు (ట్రైన్ నెం. 07753/54).
సికింద్రాబాద్ – వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్ (ట్రైన్ నెం. 07462/63).
కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే రామగిరి ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నెం. 17003/4).
కాజీపేట – బల్లార్హా మధ్య నడిచే బల్లార్హా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 17035/36).
భద్రాచలం రోడ్ – బల్లార్హా మధ్య నడిచే సింగరేణి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 17033/34). రైళ్లను వచ్చేనెల 6వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
Trains Cancellation: ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు.. ఎప్పటి వరకు అంటే?
22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు ..
మరోవైపు హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ 22 ట్రైన్ సర్వీస్సులు వారంరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ అధికారులు తెలిపారు. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల కారణంగా ట్రైన్లు రద్దు చేస్తున్నట్లుతెలిపారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 6వ తేదీ రైళ్ల రద్దు కొనసాగుతుందని తెలిపారు. రద్దయిన రైళ్లలో లింగంపల్లి – హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 12 ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి. అదేవిధంగా ఉందానగర్ – లింగంపల్లి, ఫలక్ నూమా – లింగంపల్లి మధ్య నడిచే మరో 10 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పారు.