Pawan Kalyan : హోం క్వారంటైన్‌లో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ అయ్యంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

Pawan Kalyan : హోం క్వారంటైన్‌లో పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Updated On : April 11, 2021 / 1:57 PM IST

Pawan Kalyan Home Quarantine : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ అయ్యంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు’ అని ప్రకటనలో తెలిపారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమాకి వస్తున్న కలెక్షన్లు చిత్ర బృందంలో ఆనందం నింపాయి. పవన్ సహా అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వకీల్ సాబ్ తో పవన్ ఈజ్ బ్యాక్.. అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.