Saidabad Rape: సైదాబాద్‌లో పవన్ కళ్యాణ్.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే
సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘోరంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ కుటుంబాన్ని..

Pawan Kalyan (1)
Saidabad Rape: సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘోరంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి సింగరేణి బస్తీకి వచ్చిన ఆయన కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం, పెద్దలు వారికి మద్ధతుగా ఉండాలని కోరారు.
‘మీడియాపరంగా కూడా ఇటువంటి సమస్యలు బయటకు తీసుకురావాల్సి ఉంది. జనసేన వీర మహిళా విభాగం, విద్యార్థుల విభాగం నా దృష్టికి తీసుకొచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసిరావాలి. ప్రభుత్వ తరపు నుంచి కూడా ఓదార్పు కావాలి. భరోసా కల్పించాలి. ఆ కుటుంబానికి నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నా.
పోలీసు శాఖకు కూడా విన్నవిస్తున్నా. వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరుకుంటున్నా. చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పవన్ అన్నారు. తాను కూడా ఆర్థికంగా ఆదుకుంటాననే హామీ ఇచ్చారు పవన్. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని అన్నారు.