Pubs in Hyderabad: శాపంగా మారిన పబ్‌లు.. నిద్రపోనివ్వట్లేదు

హైదరాబాద్‌ నగరంలో పబ్‌లు స్థానికుల పాలిట శాపంగా మారాయి. ఎవరి ఇళ్లలో వారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి నైట్ పబ్‌లు.

Pubs in Hyderabad: శాపంగా మారిన పబ్‌లు.. నిద్రపోనివ్వట్లేదు

Pubs

Updated On : December 25, 2021 / 6:40 PM IST

Pubs in Hyderabad: హైదరాబాద్‌ నగరంలో పబ్‌లు స్థానికుల పాలిట శాపంగా మారాయి. ఎవరి ఇళ్లలో వారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి నైట్ పబ్‌లు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఉన్న పబ్‌లను ఎత్తివేయాలని ఆందోళనకు దిగుతున్నారు స్థానికులు.

ఈ విషయంపై న్యాయం చేయాలంటూ హైకోర్టును సైతం ఆశ్రయించారు స్థానికులు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న థర్డ్‌ పబ్ వద్ద రోజూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లారేవరకు తాగుతూ.. రోడ్డుపై మద్యం బాటిళ్లు పడేస్తున్నారని చెబుతున్నారు అక్కడివారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెండు రోజుల పాటు సమయానికి క్లోజ్ చేస్తున్నారని, రెండు రోజుల తర్వాత మళ్లీ తెల్లారేవరకు పబ్‌‌లు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాగి ఇళ్లపైకి బాటిల్స్‌ విసిరేస్తున్నారని, పబ్‌ వల్ల ప్రశాంతతను కోల్పోతున్నామని స్థానికులు చెబుతున్నారు.