Corona Second Wave : సునామీలా కరోనా సెకండ్‌వేవ్‌.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : శ్రీనివాసరావు

సెకండ్‌వేవ్‌ సునామీలా వస్తోందని తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ జి. శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి చివర్లో 2వందలున్న కేసులు...ఇప్పుడు ఐదువేలు దాటాయని తెలిపారు. నాలుగువారాల్లో కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

Corona Second Wave : సునామీలా కరోనా సెకండ్‌వేవ్‌.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : శ్రీనివాసరావు

Corona Second Wave

Updated On : April 18, 2021 / 9:32 PM IST

corona second wave : సెకండ్‌వేవ్‌ సునామీలా వస్తోందని తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ జి. శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి చివర్లో 2వందలున్న కేసులు…ఇప్పుడు ఐదువేలు దాటాయని తెలిపారు. నాలుగువారాల్లో కేసులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. 10టీవీ నిర్వహించిన క్వశ్చన్‌ అవర్‌ లో ఆయన మాట్లాడుతూ ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలే లోగానే కుటుంబం మొత్తానికి వైరస్ సోకుతోందన్నారు. వచ్చే ఆరువారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబుల్‌ మ్యుటేషన్ వల్ల కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు. లాక్‌డౌన్‌ వల్ల గతంలో ఎంత లాభం జరిగిందో అంత నష్టం జరిగిందని వెల్లడించారు. లాక్‌డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లేకుండానే కరోనాను కట్టడి చేయాల్సి ఉంటుందన్నారు.

తక్కువ వ్యవధిలో అధిక కేసులు
తక్కువ వ్యవధిలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. కరోనా వచ్చినంత మాత్రాన ఆసుపత్రిలో చేరాల్సిన పనిలేదన్నారు. 100మందిలో 80మందికి ఆసుపత్రుల్లో చికిత్స అవసరం లేదని చెప్పారు. కొద్దిమంది మాత్రమే ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. కరోనా రోగులందరికీ ఆక్సిజన్ అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ఆసుపత్రుల్లో 45వేల పడకలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇంట్లో ఉన్నా మాస్కు పెట్టుకోవాల్సిందేనని అన్నారు. కరోనా గాలి ద్వారా కూడా ప్రయాణం చేస్తుందని తెలిపారు.

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఐదుగురి వల్ల 4వందల మందికి వైరస్
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఐదుగురి వల్ల 4వందల మందికి వైరస్ సోకిందన్నారు. జూన్ వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెప్పారు. స్పానిష్‌ ఫ్లూ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలన్నారు. పండగలు వస్తుంటాయి.. పోతుంటాయి… వాటికన్నా ప్రాణాలు ముఖ్యం అన్నారు. అవకాశం ఉంటే కొన్నాళ్లు పెళ్లిళ్లు వాయిదా వేసుకోండని సూచించారు. వ్యాక్సిన్ కొరత ఉన్నమాట నిజమేనని తెలిపారు. వ్యాక్సిన్‌ కొరత తీరడానికి కొంత సమయం పడుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే ఈ వైరస్‌ నుంచి బయటపడగలమని చెప్పారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు పెట్టుకోవడం సరికాదన్నారు.

టీకా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు
టీకా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. వ్యాక్సిన్లు ఉన్నది ప్రాణాలు పోయడానికే… తీయడానికి కాదని స్పష్టం చేశారు. 60-70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకుంటే హెర్డ్‌ ఇమ్యునిటీ వస్తుందన్నారు. మొదట్లో చాలామంది వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపలేదన్నారు. రాబోయే రోజుల్లో 18 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ను పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరగా రోగిని గుర్తించేందుకే రాపిడ్‌ టెస్టులు చేస్తున్నామని చెప్పారు.