Jubilee Hills Pub: పబ్‌పై పోరాటం.. జూబ్లీహిల్స్‌లో ఆందోళన
హైదరాబాద్ నగరంలో పబ్‌లకు వ్యతిరేకంగా ప్రజలు వాయిస్ వినిపించారు.

Tot Pub
Jubilee Hills Pub: హైదరాబాద్ నగరంలో పబ్‌లకు వ్యతిరేకంగా ప్రజలు వాయిస్ వినిపించారు. ఇళ్ల మధ్యలో పబ్‌లు నడపడంపై నిరనస వ్యక్తం చేశారు కాలనీవాసులు. ప్రశాంతంగా జీవించాల్సిన కాలనీల్లో పబ్‌లేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. రోజువారీ న్యూసెన్స్‌పై నిర్వాహకులను స్థానికులు నిలదీస్తున్నారు. తెల్లారేవరకు డీజే మ్యూజిక్ హోరు, యువత అసభ్య నృత్యాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో టాట్ పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ నిరసన వ్యక్తం చేశారు అక్కడ నివసించే ప్రజలు. తాగిన మత్తులో చిందలేదస్తున్న యువత ఒళ్లు మరచి మద్యం బాటిళ్లను ఇళ్ల మధ్యలోకి విసిరేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల మధ్య పబ్ నిర్వహణ అందరికీ తలనొప్పిగా మారిందంటూ ఆందోళన చేశారు మహిళలు. టాట్ పబ్‌ను తీసివేయాలని, టాట్ పబ్‌లో గతంలో రేవ్ పార్టీల నిర్వహణ కూడా జరిగినట్లు కేసులు నమోదైనా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.