మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ.. ఈసారి మూడ్రోజుల పర్యటన.. తేదీలు ఇవే!

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ.. ఈసారి మూడ్రోజుల పర్యటన.. తేదీలు ఇవే!

PM modi

PM Modi Telangana Tour : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను సగానికిపైగా నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరవేసేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం.. మరో ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

ఇదిలాఉంటే.. ఈనెల 4, 5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. రెండు రోజుల పాటు పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభల్లో మోదీ పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అయితే, మరోసారి ప్రధాని తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈసారి మూడ్రోజులపాటు మోదీ పర్యటన కొనసాగనుంది.

Also Read : Dharmana Prasada Rao : రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోంది- మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

 

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది. అయితే, తేదీలను సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యనేతలతో చర్చించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి త్వరలో ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.