PM Narendra Modi: వారి ఉజ్వల భవిష్యత్తుకోసం ఎంతవరకైనా వెళ్తాం.. అరవింద్ ట్వీట్ కు ప్రధాని మోదీ రియాక్షన్

ఎంపీ అర్వింద్ ట్వీట్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. అధికారిక ట్విటర్ ఖాతా నుంచి తెలుగులో ట్వీట్ చేశారు.

PM Narendra Modi: వారి ఉజ్వల భవిష్యత్తుకోసం ఎంతవరకైనా వెళ్తాం.. అరవింద్ ట్వీట్ కు ప్రధాని మోదీ రియాక్షన్

PM Modi

PM Narendra Modi And Arvind Dharmapuri: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రూ. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ నిజామాబాద్ పసుపు రైతులకు శుభవార్త చెప్పారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి పసుపు రైతు తరపున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఎంపీ ధర్మపురి అర్వింద్ వీడియో విడుదల చేశారు.

Read Also : Narendra Modi: తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం: ఎన్నికల వేళ మోదీ వరాల వర్షం

ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ ప్రకటన పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ లో రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బీజేపీ కట్టుబడి ఉదని అనడానికి జాతీయ పసుపు బోర్డు ప్రకటనే నిదర్శనం. ఈ చర్య పసుపు సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. సరమైన ధరలు, ప్రపంచ గుర్తింపును భరోసా చేస్తుంది. పసుపు కేవలం ఒక పంట కాదు. ఇది మన సంస్కృతిలో అంతర్భాగం అని అర్వింద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధాని ప్రకటన రైతుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందజేస్తుందని, మన వ్యవసాయ వారసత్వాన్ని భద్రపరుస్తుందని అర్వింద్ అన్నారు. జాతీయ పసుపు బోర్డును ప్రకటించిన ప్రధాని మోదీకి మేమంతా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రైతుల పట్ల ప్రధాని మోదీకి ఉన్న దృక్పథం, అంకితభావం తరతరాలుగా గుర్తుండి పోతాయి. తెలంగాణ రైతాంగానికి జాతీయ పసుపు బోర్డు ఆశాజ్యోతి అని ధర్మపురి అర్వింద్ ట్విటర్ లో పేర్కొన్నారు.

Read Also : Nara Lokesh: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? వాళ్లకు బుర్రా బుద్దీ ఏమైంది..? ఢిల్లీలో లోకేశ్ దీక్ష

అర్వింద్ ట్వీట్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. అధికారిక ట్విటర్ ఖాతా నుంచి తెలుగులో ఇలా రాశారు.. ‘మన రైతుల శ్రేయస్సు, సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డు‌ను ఏర్పాటు చేయడం ద్వారా, మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం. మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం’. అని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.