Naga Shaurya’s Father : గుత్తా సుమన్ మాములోడు కాదు.. పీఎస్‌కు రానున్న హీరో నాగశౌర్య తండ్రి

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పేకాట కేసులో గుత్తా సుమన్ కు ఉచ్చు బిగుస్తోంది. ఫామ్ హౌస్ ను ఏకాం పేకాట స్థావరంగా ఏర్పాటు చేశాడు.

Naga Shaurya’s Father : గుత్తా సుమన్ మాములోడు కాదు.. పీఎస్‌కు రానున్న హీరో నాగశౌర్య తండ్రి

Suman

Updated On : November 3, 2021 / 11:50 AM IST

Manchirevula Farmhouse : రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పేకాట కేసులో గుత్తా సుమన్ కు ఉచ్చు బిగుస్తోంది. ఫామ్ హౌస్ ను ఏకాం పేకాట స్థావరంగా ఏర్పాటు చేశాడు. విదేశీ క్యాసినో నిర్వాహకులతో గుత్తా సుమన్ కు పరిచయాలు ఉన్నాయని గుర్తించారు. హీరో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ పీఎస్ కు  రానున్నారు. ఫామ్ హౌస్ లీజ్ అగ్రిమెంట్ తేవాలని రవీంద్రకు సూచించారు. లీజ్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను పోలీసులు‌ ప్రశ్నించనున్నారు. పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపేవాడని, మద్యం సరఫరా, అమ్మాయిల సహాయంతో ఈవెంట్ నిర్వహించేవాడన తేలింది. ఓ వ్యక్తి సెట్టింగ్ కు రూ.25 వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు నిర్ణయించి. వారి వద్ద నుండి సుమన్ వసూలు చేసేవాడు. గుత్తా సుమన్ ను చర్లపల్లి జైలు నుండి నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సుమన్ ను 2 రోజుల కస్టడీకి పోలీసులకు అప్పగించింది ఉప్పర్ పల్లి కోర్టు. మంగళవారం, బుధవారం గుత్తా సుమన్ ను నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు.

Read More : Telangana : మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

నార్సింగ్‌ మంచిరేవుల విల్లాలో అరెస్ట్ అయిన పేకాటరాయుళ్ల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్‌కు ఉప్పరపల్లి కోర్టు షాకిచ్చింది. ఈ కేసులో సుమన్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. ఏ2 నుంచి ఏ30 వరకు ఉన్న నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. 10 వేల రూపాయల సూరిటీలతో 29 మందికి బెయిల్ ఇచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను వారం రోజుల కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 5న విచారణ జరపనుంది కోర్టు.

Read More : IND vs AFG : ముచ్చటగా మూడో మ్యాచ్..ఇండియా గెలిచేనా ?

పేకాట కేసు రిమాండ్ రిపోర్టులో కూడా గుత్తా సుమన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. గుత్తా సుమన్ చాలా ఏళ్లుగా క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాకీలకు చిక్కకుండా స్టార్‌ హోటళ్లు, ఫాంహౌసులను అడ్డాగా చేసుకుని పత్తాలాడుతున్నట్లు తేల్చారు. గత ఆర్నెల్ల నుంచి ఈ దందా నడిపిస్తున్నాడు గుత్తా సుమన్‌. మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో క్యాసినోలు రన్‌ చేస్తున్నాడు. గతంలో ప్రముఖులతో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టి… ఫాలోయింగ్ పెంచుకునే వాడని పోలీసులు చెప్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో సంబంధాలున్నాయని బుకాయించి… కస్టమర్లకు ముగ్గులోకి దించేవాడు.

Read More : Deepotsav : అయోధ్య జిగేల్, ప్రపంచ రికార్డు

వందలు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఆటలు నడిపాడు. లక్షలు పెట్టి ఆడే స్థోమత ఉన్న వాళ్లనే సెలెక్ట్‌ చేసుకున్నాడు. వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేశాడు. పేకాట జరిగే లొకేషన్‌ను వాట్సాప్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేసేవాడు. పేకాట నిర్వహించేందుకు టెక్నాలజీని ఫుల్‌గా వాడుకున్నాడు గుత్తా సుమన్‌. డబ్బు చేతికి తీసుకునే వాడు కాదు. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ డిపాజిట్‌ చేయించుకుని… కస్టమర్లకు కాయిన్ల రూపంలో ఇచ్చేవాడు. ఒక్కో కాయిన్‌ విలువ వెయ్యి రూపాయల నుంచి పదివేల దాకా ఉండేది.

Read More : Eetala Rajendar: హుజూరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం!

ప్రతి సిట్టింగ్‌లో కోట్లల్లో గేమ్స్‌ నడిపించేవాడు. అయితే కేవలం ఉదయం పూట మాత్రమే ఆటలు నిర్వహించేవాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. పక్కా సమాచారంతో నార్సింగ్‌లో తనిఖీ చేసిన పోలీసులకు ఈ గ్యాంగ్ చిక్కింది. మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఉప్పరపల్లి కోర్టు.. నిందితులకు ఈ నెల 15వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే ఇవాళ నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. గుత్తా సుమన్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు.. మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.