నో పర్మిషన్ : కాంగ్రెస్ కు మరో షాక్

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్‌ చేసింది. గాంధీ భవన్‌

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 02:11 AM IST
నో పర్మిషన్ : కాంగ్రెస్ కు మరో షాక్

Updated On : December 28, 2019 / 2:11 AM IST

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్‌ చేసింది. గాంధీ భవన్‌

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. నేడు (డిసెంబర్ 28,2019) కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్‌ చేసింది. గాంధీ భవన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని భావించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. రెండుసార్లు అనుమతి కోసం పోలీసులను ఆశ్రయించినా అనుమతి లభించలేదు. దీంతో ఇవాళ(డిసెంబర్ 28,2019) కాంగ్రెస్‌ నేతలు గాంధీ భవన్‌లోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 

ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతి ఇవ్వరు అని ప్రశ్నించారు. నిరంశకుంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఆర్ఎస్ఎస్ భారీ సభకు అనుమతినిచ్చిన కేసీఆర్ సర్కారు.. తిరంగా మార్చ్ పేరుతో కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీకి ఎందుకు ఇవ్వదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తం, పార్టీ ఆవిర్భావ వేడుకలు, ర్యాలీ నిర్వహణపై నేతలు చర్చించారు.

ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టిన హస్తం నేతలు.. జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్‌ మార్చ్ చేపట్టాలని అనుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్రం అమలు చేస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించండి-రాజ్యాంగాన్ని రక్షించండి పేరుతో నిరసనలకు పిలుపునిచ్చింది.

Also Read : రాహుల్ గాంధీ ‘లయ్యర్ ఆఫ్ ద ఇయర్‌’