Huge Cash Seized : జూబ్లీహిల్స్‌లో భారీగా పట్టుబడిన నగదు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ సమీపిస్తున్న వేళ పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ లో అక్రమ నగదు లభిస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు.

Huge Cash Seized : జూబ్లీహిల్స్‌లో భారీగా పట్టుబడిన నగదు

Huge cash seized

Updated On : October 31, 2022 / 1:50 PM IST

Huge cash seized : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ సమీపిస్తున్న వేళ పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ లో అక్రమ నగదు లభిస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 71లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.89.92 లక్షల నగదును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Hyderabad Hawala Money : హైదరాబాద్‌లో కలకలం.. మరోసారి భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు.. రూ.4కోట్లు సీజ్

మూడు రోజుల క్రితం పంజాగుట్టలో రూ.70 లక్షలు, బేగంబజారులో రూ.48.50 లక్షలు, నగర శివార్లలో రూ.45 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. గత 18 రోజుల్లో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ.20 నుంచి 26 కోట్లు పట్టుబడం గమనార్హం.