Hyderabad Hawala Money : హైదరాబాద్‌లో కలకలం.. మరోసారి భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు.. రూ.4కోట్లు సీజ్

హైదరాబాద్ నగరం హవాలా డబ్బుకు అడ్డాగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో 54 లక్షల రూపాయల డబ్బు పట్టబడగా, ఇవాళ ఇదే ప్రాంతంలో మరో 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు పట్టుబడింది.

Hyderabad Hawala Money : హైదరాబాద్‌లో కలకలం.. మరోసారి భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు.. రూ.4కోట్లు సీజ్

Updated On : October 9, 2022 / 5:20 PM IST

Hyderabad Hawala Money : హైదరాబాద్ నగరం హవాలా డబ్బుకు అడ్డాగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో 54 లక్షల రూపాయల డబ్బు పట్టబడగా, ఇవాళ ఇదే ప్రాంతంలో మరో 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు పట్టుబడింది.

నగదును సీజ్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు రూ.4 కోట్ల హవాలా డబ్బును పోలీసులు సీజ్ చేశారు.