Telangana Assembly Elections 2023 : మా బిడ్డలను చంపింది కాంగ్రెస్సే .. క్షమాపణ చప్పాలంటూ పోస్టర్లు

బోధన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మా బిడ్డలు చనిపోవటానికి కారణం కాంగ్రెస్సే అని..కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ రాశారు.

Telangana Assembly Elections 2023 : మా బిడ్డలను చంపింది కాంగ్రెస్సే .. క్షమాపణ చప్పాలంటూ పోస్టర్లు

Posters against Rahul Gandhi

Updated On : November 25, 2023 / 11:12 AM IST

Posters against Rahul Gandhi : తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో చివరి రోజులు తెలంగాణలో పల్లెలు, పట్టణాలు నేతల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

బీజేపీ నేతలు సైతం నియోజకవర్గాల వారిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 25,2023) ఒక్కరోజు ముగ్గురు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ,కేంద్ర మంత్రి అమిత్ షా,యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్ లు ప్రచారంలో పాల్గొననున్నారు.

Also Read : IT Raids Hyderabad : బడా వ్యాపారులే టార్గెట్ .. పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

అలాగే  కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గకుండా దూకుడు పెంచింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తెలంగాణలో మెరుపు పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే..ఈరోజు రాహుల్ గాంధీ నిజామాద్ లోని బోధన్ లో పర్యటించనున్నారు. ఈక్రమంలో బోధన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోస్టర్లలో రాహుల్, రేవంత్ ఫోటోలు ముద్రించి ‘మా బిడ్డలు చనిపోవటానికి కారణం కాంగ్రెస్సే అంటూ రాశారు. అంతేకాదు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Also Read : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నలుగురు బీజేపీ అగ్రనేతలు.. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేస్తారంటే..

రాహుల్ గాంధీ బోధన్ పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియటం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణలో పలువురు బలిదానాలకు కారణం కాంగ్రెస్సే అని..తమ బిడ్డలను చంపింది కాంగ్రెస్సే అని క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే అంటూ రాశారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి నిరద్యోగులు కష్టాలు పడుతున్నారంటూ పోస్టర్లలో ముద్రించారు.

కాగా..తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని ధీమాతో ఉన్న హస్తం నేతలు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ లపై మండిపడుతున్నారు. తమ నేతలను..అభ్యర్ధులను రెండు పార్టీలు ఒక్కటై టార్గెట్ చేస్తున్నాయని కావాలటే దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని రెండు కలిసి కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం…కాలనీ సంక్షేమ సంఘాలపై కేటీఆర్ కన్ను

ఈ క్రమంలో బోధన్ లో రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్, సీఎం కేసీఆర్ పై కామారెడ్డిలో పోటీకి సై అంటున్న రేవంత్ రెడ్డి పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ పోస్టర్లు కూడా కుట్రలో భాగమేనని..కావాలనే తమను టార్గెట్ చేస్తు ఇటువంటివి క్రియేట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓటమి భయంతోను ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శిస్తున్నారు.