Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం.. పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర నేతలు పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం జక్లేర్ వద్ద భోజన విరామం తీసుకుంటారు.

Rahul Gandhi skips gujarat and himachal assembly elections
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర నేతలు పాల్గొన్నారు.
ఇవాళ మధ్యాహ్నం జక్లేర్ వద్ద భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. గుడిగండ్ల వరకు పాదయాత్ర ఉంటుంది. ఇవాళ రాత్రి ఎలిగండ్లలో రాహుల్ గాంధీ బస చేస్తారు. జోడో యాత్ర ఇవాళ దాదాపు 28 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.
ఈ నెల 23న కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలోకి ఆ యాత్ర ప్రవేశించింది. గుడెబల్లూరు వద్ద పాదయాత్రకు రాహుల్ విరామం ఇచ్చారు. దీపావళి, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాల నేపథ్యంలో ఆ యాత్రకు మూడు రోజుల పాటు బ్రేక్ పడింది.
LIVE: Bharat Jodo Yatra | Makthal to Marikal | Narayanpet | Telangana https://t.co/6hZ1y3anuC via @YouTube pic.twitter.com/wP62ng1Qy5
— Telangana Congress (@INCTelangana) October 27, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..