హైదరాబాద్‌ సహా తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షం

Weather Updates: రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌ సహా తెలంగాణ పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్‌లో వర్షం పడుతోంది. అలాగే, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణ గూడ, కోఠి, అబిడ్స్, నాంపల్లిలో వాన దంచికొడుతోంది. హైదరాబాద్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. కాగా, రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పలుచోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ అయింది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీంతో ఉత్తర ఒడిశా తీరానికి దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

సోమవారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మలుగు, కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయి. మంగళవారం కూడా ఆదిలాబాద్‌, ఆసిఫ్రాబాద్‌ జిల్లాలతో పాటు మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి సహా పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. శనివారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

Also Read: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు ఫైర్