బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ దారెటు.. మహారాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

అక్కడ హిందూ ధర్మం కోసం శివాజీ ఆశయాలంటూ పనిచేసే అవకాశం ఉంటుంది.

బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ దారెటు.. మహారాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

Raja Singh

Updated On : July 1, 2025 / 9:07 PM IST

ఆయన చాలా రోజులుగా తెలంగాణ బీజేపీలో అసంతృప్తిలో ఉన్నారు. ఎప్పటికప్పుడు తన వాయిస్‌ను వినిపిస్తూ వచ్చారు. తనకు జరుగుతున్న అన్యాయం..పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సంచలన కామెంట్స్‌ చేస్తూ వస్తున్న రాజాసింగ్‌ ఫైనల్‌గా ఇట్స్‌ టైమ్‌ టు రిజైన్‌ అంటూ బిగ్ బ్లాస్ట్‌ పేల్చారు. ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా..కట్టర్‌ హిందుత్వ వాదిగా నిత్యం పోరాటం చేస్తుండే రాజాసింగ్‌ రాజీనామా అంశం బీజేపీలోనే కాదు తెలంగాణ పాలిటిక్స్‌లో..తెలంగాణ పబ్లిక్‌లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం, హిందుత్వం కోసం నిరంతరం ఫైట్ చేసే లీడర్‌ బీజేపీకి రిజైన్‌ చేయడం తీవ్ర దుమారమే లేపుతోంది. అయితే బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్‌ దారెటు అనే దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్ నడుస్తోంది.

బీజేపీలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఎన్నో పరిణామాలు..మరెన్నో ఇష్యూస్‌ తర్వాత పార్టీకి రిజైన్‌ చేశారు. ఆయన రాజీనామాపై బీజేపీ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే రాజాసింగ్‌ రాజీనామా వ్యూహత్మక ఎత్తుగడే అంటున్నారు. ఆయన ఎప్పటినుంచో బీజేపీలోని పలువురు స్టేట్‌ లీడర్లతో పొసగక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష నామినేషన్‌ ప్రక్రియ వేళ రాజీనామా చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Also Read: టెక్కలి పాలిటిక్స్‌లో దువ్వాడ వాణి యాక్టీవ్ రోల్.. తనతో విబేధించిన భర్తకు పొలిటికల్‌గా షాకిచ్చే స్కెచ్

అయితే రాజాసింగ్ స్టేట్ బీజేపీ నుంచే కాదు తెలంగాణ రాజకీయాలను నుంచి తప్పుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. దేశవ్యాప్తంగా హిందుత్వ సర్కిల్‌లో రాజాసింగ్‌కు ఓ రేంజ్‌లో మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ప్రధానంగా మహారాష్ట్రలో ఆయనకున్న క్రేజే వేరు. తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకుని రాజాసింగ్ మహారాష్ట్రలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు.

మూడు ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్న రాజాసింగ్?
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ మూడు ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. రాజాసింగ్‌కు బీజేపీ అంటే కోపం లేదు. కేవలం తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలపైనే ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆ క్రమంలోనే స్టేట్‌ బీజేపీకి రాజీనామా చేశారు. అయితే జాతీయ పెద్దలు టచ్‌లోకి వచ్చి మాట్లాడితే..తన మనసులో మాటగా మహారాష్ట్ర బీజేపీలో క్రియాశీలకంగా పనిచేయాలనేది ఆయన ఆలోచన అంటున్నారు.

బీజేపీ పెద్దలు తనతో మాట్లాడకపోతే..హిందుత్వానికి మారుపేరుగా ఉన్న మరో పార్టీ శివసేన పార్టీలోకి వెళ్లి మహారాష్ట్ర వేదికగా పనిచేయాలనేది ఇంకో ఆప్షన్ అంటున్నారు. అక్కడ హిందూ ధర్మం కోసం శివాజీ ఆశయాలంటూ పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక మరో ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి..బీఆర్‌ఎస్‌లో చేరి మహారాష్ట్ర బాధ్యతలు స్వీకరించి అక్కడ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేసే అవకాశాలు ఉన్న టాక్ కూడా నడుస్తోంది.

గత ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో మాజీ సీయం సహా పలువురు ఇతర పార్టీల కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అదే సమయంలో రాజాసింగ్‌కు బీఆర్ఎస్ మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించే దిశగానూ చర్చలు జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో అది ముందడుగు పడలేదు. ఇప్పుడు ఆయన బీజేపీకి రిజైన్ చేయడంతో..మహారాష్ట్ర బీఆర్ఎస్ బాధ్యతలు తీసుకుని అక్కడ పార్టీ యాక్టివిటీలో బిజీ అయ్యే స్కెచ్ ఉందంటున్నారు. ఈ మూడు ఆప్షన్లలో ఏది ఎంపిక చేసుకుంటారో తెలియకపోయిన..ఆ మూడింట్లో ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా తెలంగాణ రాజకీయాల నుంచి రాజాసింగ్ తప్పుకోవడం మాత్రం పక్కా. రాజాసింగ్‌ అడుగులు ఎటు వైపు పడుతాయో చూడాలి మరి.