Telangana : రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా

రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా చేశారు. తాజాగా ఆయన మండలికి ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telangana : రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా

Telangana

Updated On : December 2, 2021 / 3:09 PM IST

Telangana : తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ విజయం సాధించిన సంగతి విదితమే. మండలికి ఎన్నిక కావడంతో రాజ్యసభ పదవికి ప్రకాష్ రాజీనామా చేశారు. గురువారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి తన రాజీనామా లేఖను అందచేశారు. బండా వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్, కే.కేశవరావు, సురేష్ రెడ్డి, లింగయ్య యాదవ్ ఉన్నారు. కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండా ప్రకాష్ తోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు

చదవండి : MLC : తెలంగాణ శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం