ఎవరీ రాకేష్ రెడ్డి అంటే.. సెటిల్మెంట్లు, హైటెక్ వ్యభిచారంలో దిట్ట

హైదరాబాద్ : కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితుడుగా వినిపిస్తున్న పేరు రాకేష్ రెడ్డి. రెండు రోజులుగా ఈ మాట మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ రాకేష్ రెడ్డి ఎవరు.. ఏం చేస్తుంటాడు.. ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనేది ఆసక్తిగా మారింది. పోలీస్ విచారణలో ఇతని గుట్టురట్టు అవుతుంది. తవ్వేకొద్దీ ఇతని లీలలు అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీలో చురుగ్గా తిరగటంతోపాటు కొన్ని రాజకీయ సభలకు హాజరయ్యాడు. పలురువు రాజకీయ, వ్యాపారవేత్తలతోనూ సంబంధాలు ఉన్నాయి. అతని గురించి బ్రీఫ్ గా..
– హైదరాబాద్ లో మోసాలు, దందాలు, సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ప్రముఖ హీరోయిన్ తో వ్యభిచారం చేయిస్తూ గతంలో పోలీసులకు చిక్కాడు.
– యువతులతో హైటెక్ వ్యభిచారం చేయించటంలో రాకేశ్ దిట్టగా ఈ దర్యాప్తులో వెల్లడయ్యింది.
– ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.
– కూకట్ పల్లి ఎమ్మెల్యే పేరుతో రూ.80 లక్షలు వసూలు చేశాడు.
– సినీ రంగంతో పరిచయాలున్న రాకేశ్ రెడ్డికి.. శిఖాచౌదరి పరిచయం అయ్యింది. ఇద్దరి మధ్య చనువు పెరిగింది.
– చిగురుపాటి జయరాం తన పాలీ లెన్సెస్ టెక్ట్రాన్ కంపెనీలో ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు శిఖా శర్మ ద్వారా పరిచయం అయిన రాకేశ్ నుంచి రూ.4.5కోట్లు తీసుకున్నాడు. ఆ డబ్బు కూడా ఇతర వ్యక్తుల నుంచి తీసుకొచ్చి జయరాంకి ఇచ్చాడు.
– రాకేశ్ తో ఉన్న దగ్గరి చనువుతో.. శిఖాచౌదరి కూడా అప్పు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసింది. శిఖా చౌదరిని వదిలేయాలని జయరాం.. రాకేశ్‌తో గొవవకు దిగటంతో అతడికి ఇవ్వాల్సిన రూ.4.5 కోట్లతో పాటు శిఖాకి ఖర్చు పెట్టిన కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తానని రాకేశ్ జయరాంకు చెప్పాడు.
– జనవరి 29న జయరాం అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. డబ్బు ఇవ్వాలని కోరాడు. జయరామ్ స్పందించలేదు. జనవరి 31న జయరాంను జూబ్లీహిల్స్‌లో రోడ్ నెం-10లోని తన ఇంటికి పిలిచాడు రాకేష్. ఇద్దరి మధ్య గొడవ. ఆవేశానికి గురైన రాకేశ్.. జయరాంపై దాడి చేశాడు. జయరామ్ కు చెందిన ఫైనాన్స్ విషయాలన్నీ చక్కబెట్టే శిఖాచౌదరి గురించే ఈ హత్య జరిగిందా? రూ.4 కోట్ల వసూలు చేసుకోకుండానే జయరామ్ ను రాకేశ్ రెడ్డి హత్య చేయటానికి కారణం ఏమిటీ అనే పలు కీలక అంశాలపై పోలీసులు మరింతగా విచారిస్తున్నారు. విచారణలో రాకేశ్ నేర చరిత్ర కూడా బయటపడుతుండటంతో.. మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు.