సికింద్రాబాద్‌ వెళ్లే రైలు ప్రయాణీకులకు అలెర్ట్‌.. ప్లాట్‌ఫారమ్స్‌ మూసివేత.. 76రైళ్ల మళ్లింపు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా 10వ నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్ ఫాం వరకు మూసివేశారు. అలాగే 5,6వ నంబర్ ప్లాట్ ఫామ్ లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు.

సికింద్రాబాద్‌ వెళ్లే రైలు ప్రయాణీకులకు అలెర్ట్‌.. ప్లాట్‌ఫారమ్స్‌ మూసివేత.. 76రైళ్ల మళ్లింపు..

Secunderabad Railway Station

Updated On : April 16, 2025 / 2:53 PM IST

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా 10వ నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్ ఫాం వరకు మూసివేశారు. అలాగే 5,6వ నంబర్ ప్లాట్ ఫామ్ లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు. సుమారు 120 రోజులపాటు రైళ్ల రాకపోకలపై ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక సూచన చేసింది. 76రైళ్లు మళ్లింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.

 

సికింద్రాబాద్ నుంచి 30 రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించారు. శాశ్వతంగా చర్లపల్లి టెర్మినల్ కు ఎనిమిది రైళ్లు మారాయి. చర్లపల్లిలో ఆరు రైళ్లు అదనపు హోల్టింగ్ కు అవకాశం కల్పించారు. దూర ప్రాంతాలకు వెళ్లే 32రైళ్లను సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లి మీదుగా నడిపించనున్నారు.

 

తాత్కాలికంగా మారిన స్టేషన్లు..: విజయవాడ – సికింద్రాబాద్ (12713/12714) ఎక్స్ ప్రెస్ రైలు కాచిగూడ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించనుంది. పోర్ బందర్ – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలును ఉందానగర్ నుంచి నడుపుతారు. సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లను సికింద్రాబాద్ కు బదులు మల్కాజిగిరి నుంచి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి పుణెకు నడిచే శతాబ్ధి ఎక్స్ ప్రెస్ నాంపల్లి నుంచి పుణెకు రాకపోకలు సాగించనుంది.

 

చర్లపల్లి మీదుగా మళ్లించే రైళ్లు.. : వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడిచే 32 రైళ్లను చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్ కు రాకుండా లింగంపల్లి నుంచి సనత్ నగర్, మౌలాలి రూట్ లో చర్లపల్లికి చేరుకుంటాయి. అదిలాబాద్ – తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్, లింగంపల్లి – కాకినాడ గౌతమి ఎక్స్ ప్రెస్, కాజీపేట్ -హడాప్సర్, లింగంపల్లి – విశాఖపట్టణం, సంబాల్సూర్ – నాందేడ్, విశాఖపట్టణం – నాందేడ్, విశాఖపట్టణం – సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం – నాగర్ సోల్, నర్సాపూర్ – నాగర్ సోల్, వాస్కోడిగామ – జాసిఢ్, మచిలీపట్నం – సాయినగర్ షిరిడీ, కాకినాడ – సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం – ఎల్టీటీ ముంబై, పూర్ణ – తిరుపతి, నాందేడ్ – ఈరోడ్, కాకినాడ – లింగంపల్లి ఎక్స్ ప్రెస్ రైళ్లు చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

 

చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే..: సికింద్రాబాద్-మణుగూర్ (12745/12746), సికింద్రాబాద్- రేపల్లె (17646/17645), సిలిచర్ – సికింద్రాబాద్ (12513/12514), సికింద్రాబాద్-దర్భంగా (17007/17008), సికింద్రాబాద్- యశ్వంత్పూర్ (12735/12736), సికింద్రాబాద్ – అగర్తల (07030/07029), సికింద్రాబాద్ – ముజఫర్ పూర్ (05294/05293), సికింద్రాబాద్-దానాపూర్ (07647/07648). సికింద్రాబాద్- సంత్రాగచ్చి (07221/07222), హైదరాబాద్-రక్సాల్ (07051/07052) ఎక్స్ ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ పనుల దృష్ట్యా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగి స్తాయి. అలాగే సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, గుంటూర్- సి కింద్రాబాద్ రైళ్లకు చర్లపల్లి టెర్మినల్లో అదనపు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. అదేవిధంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 60కి పైగా రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు.