రియాక్టర్‌ పేలుడు ఘటన.. 13కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 12 మంది పరిస్థితి విషమం

ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని వివేక్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అన్న విషయంపై ఒక రిపోర్ట్ వస్తుందని, ఆ తర్వాత ఈ ప్రమాద ఘటనపై క్లారిటీ వస్తుందని తెలిపారు.

రియాక్టర్‌ పేలుడు ఘటన.. 13కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 12 మంది పరిస్థితి విషమం

Updated On : June 30, 2025 / 4:04 PM IST

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం రియాక్టర్‌ పేలుడు ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య 13కి చేరింది. 30 మందికి గాయాలు అయ్యాయి. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.

రియాక్టర్ పేలుడు ధాటికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలింది. గ్రౌండ్‌ +2 అంతస్తుల భవనం కూలిపోవడంతో భారీ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలుడు ధాటికి అంతస్తులోని సిబ్బంది ఎగిరిపడ్డారు. రెండో అంతస్తు నుంచి కిందపడ్డవారి పరిస్థితే విషమంగా ఉంది. శిథిలాలను భారీ క్రేన్లతో తొలగిస్తున్నారు ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా సిబ్బంది. మరో 3 గంటల్లో శిథిలాలను తొలగిస్తామని అధికారులు అంటున్నారు.

Also Read: భూమి కంపించేంత శబ్దం వచ్చింది: హరీశ్ రావు

ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామి మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లో స్పందించామన్నారు. కలెక్టర్, జిల్లా యంత్రాగంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 34 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని వివరించారు. 12 మంది ఐసీయూలో ఉన్నారని వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నమని తెలిపారు.

ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని వివేక్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అన్న విషయంపై ఒక రిపోర్ట్ వస్తుందని, ఆ తర్వాత ఈ ప్రమాద ఘటనపై క్లారిటీ వస్తుందని తెలిపారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వివరాలు

  •  నగ్నజిత్ బారి (20), ఒడిశా
  •  రామ్ సింగ్ (50), ఒడిశా
  •  రాంరాజ్ (25), బిహార్
  • రాజశేఖర్ రెడ్డి (40), ఆంధ్రప్రదేశ్
  •  సంజయ్ ముఖయా ( 25), బిహార్
  • ధన్ బీర్ కుమార్ దాస్ (28), బిహార్
  • నీలాంబర్ (19), ఒడిశా
  • సంజయ్ కుమార్ యాదవ్ (28), ఒడిశా
  • గణేశ్ కుమార్ (26), బిహార్
  • దేవ్ చంద్ (30), బీహార్
  • యశ్వంత్ (30), విజయవాడ
  • అభిషేక్ కుమార్, బిహార్
  • నాగర్ జిత్ తివారి, ఒడిశా