గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల భర్తీ

త్వరలోనే 15 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ కళ్లల్లో వెలుగులు చూడాలన్నదే..

గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల భర్తీ

CM Revanth Reddy

Updated On : January 31, 2024 / 6:28 PM IST

CM Revanth Reddy: హైదరాబాద్ ఏల్బీ స్టేడియంలో నర్సింగ్‌ ఆఫీసర్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. నర్సింగ్‌ ఆఫీసర్ల ఆనందంలో సర్కార్ భాగసామ్యం అవుతోందని చెప్పారు.

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేస్తామన్నారు. ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలోనే 15 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ కళ్లల్లో వెలుగులు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.

ఇవాళ 7094 మందికి స్టాఫ్ నర్సులుగా నియామక పత్రాలను అందజేశామని, సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్‌గా పనిచేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగాల కోసమే తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ యువత ముందుండి పోరాడిందని తెలిపారు.

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేర్చలేదని చెప్పారు. అంతేగాక, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. కేసీఆర్ కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని చెప్పారు. కల్వకుంట్ల కవిత ఎంపీగా ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చారని విమర్శించారు.

స్టాఫ్ నర్సుల ఉద్యోగాల విషయాన్ని మాత్రం పట్టించుకోలేదని అన్నారు. తాము అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు ఇస్తుంటే తమపై హరీశ్ రావు మరోలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఉద్యోగాలు అవసరం లేదంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను వేశామని తెలిపారు.

Dantewada: భారీ సొరంగాన్ని నిర్మించుకున్న మావోయిస్టులు