Revanth Reddy : 50శాతం సీట్లు కొలిక్కి, త్వరలోనే జాబితా విడుదల- అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మిగతా 50శాతం సీట్ల మీద కూడా మిగతా అందరితో మాట్లాడి వారి సూచనలు తీసుకుని సీఈసీలో పెట్టి తొందరలోనే 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని అనుకున్నాం. Revanth Reddy

Revanth Reddy On Congress List
Revanth Reddy On Congress List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభర్థుల జాబితాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 50శాతం సీట్లు కొలిక్కి వచ్చాయని, మిగిలినవి తొందరలోనే ఖరారు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అలీం మస్కత్ని చార్మినార్ నుంచి పోటీ చేయాలని కోరామన్నారు. ఆరు గ్యారెంటీలకు తోడుగా ప్రజాస్వామ్యం అనే గ్యారంటీ ఇస్తున్నాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
”దాదాపు 50శాతం సీట్లకు సంబంధించి చర్చ జరిపాము. చర్చలు కొలిక్కి వచ్చాయి. మిగతా 50శాతం సీట్ల మీద కూడా మిగతా అందరితో మాట్లాడి వారి సూచనలు తీసుకుని సీఈసీలో పెట్టి తొందరలోనే 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని అనుకున్నాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read : కేసీఆర్, హరీశ్, కేటీఆర్ లక్ష్యంగా.. బీజేపీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
”నూటికి నూరుశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రిటైర్డ్ పోలీసు “రావు” అధికారులు కేసీఆర్ ప్రైవేట్ సైన్యం గా పని చేస్తోంది. స్టీఫెన్ రవీంద్ర క్రిస్టియన్ మైనార్టీల సమావేశం ఏర్పాటు చేయడం తగదు. తనకు నచ్చిన వారికి రామకృష్ణ రావు నిధులు విడుదల చేస్తున్నారు. అరవింద్ కుమార్ ఎన్నికల కోడ్ తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. దీనిపై వెంటనే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి.
పార్టీ మారడానికి పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గుండాలి. ఇది పొన్నాల చేసిన అతి పెద్ద నేరం. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి 40వేల ఓట్లతో ఓడిపోయారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి రాజీనామా ఉపసంహరించుకోవాలి. బీఅర్ఎస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50శాతం సీట్లు ఇస్తాం” అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read : కాంగ్రెస్‌కు ఎన్‌ఆర్‌ఐ కష్టం.. ఝాన్సీరెడ్డికి ఆదిలోనే అడ్డంకులు
ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 119 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. సోమవారం జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రకటించడంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా పొత్తులున్న పార్టీలతో చర్చలు జరుపుతుండటం వల్ల ఆలస్యం అవుతున్నట్లు స్క్రీనింగ్ కమిటీ చెబుతోంది. ఎప్పుడైనా అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని స్పష్టం చేస్తున్నారు హైకమాండ్ పెద్దలు. ఇప్పటికే అభ్యర్థుల లిస్టు రెడీ చేసినా కమ్యూనిస్టులతో చర్చల కారణంగా ఆలస్యం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని, 70కి సీట్లకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగిందని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ స్పష్టం చేశారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో కలకలం రేగింది. సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గేను పంపారు. రాజీనామా ప్రకటిస్తు లేఖ చూపిస్తు పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానని.. ఇక భరించలేక రాజీనామా చేశానని తెలిపారు. 45ఏళ్ల రాజకీయ జీవితం నాది.. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా.. పదవుల కోసం కాదు. ర్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేయాల్సి వచ్చింది అని పొన్నాల వాపోయారు.
Also Read : పదవుల కోసం కాదు అవమానాలు భరించలేకే రాజీనామా చేశా : పొన్నాల లక్ష్మయ్య