కొత్తగా ఇద్దరికి చోటు.. ఒకరిద్దరిపై వేటు? వారు వీరే? తెలంగాణ క్యాబినెట్‌ ప్రక్షాళన ఎప్పుడంటే?

క్యాబినెట్ బెర్త్ ఖాయమని భావించాకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారట.

కొత్తగా ఇద్దరికి చోటు.. ఒకరిద్దరిపై వేటు? వారు వీరే? తెలంగాణ క్యాబినెట్‌ ప్రక్షాళన ఎప్పుడంటే?

Revanth Reddy

Updated On : November 12, 2025 / 3:32 PM IST

Revanth Reddy: రేవంత్ క్యాబినెట్ షఫ్లింగ్‌పై మరోసారి జోరుగా చర్చ సాగుతోంది. కొత్త సంవత్సరం జనవరి నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని టాక్. ఈ సారి కచ్చితంగా ఒకరిద్దరు మంత్రులపై వేటు పడుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మినిస్టర్లలో పలువురికి ఉద్వాసన తప్పదంటున్నారు. ఎవరిపై వేటు అనేది ఆసక్తికరంగా మారింది.

సేమ్‌టైమ్ ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వారి శాఖలు కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు మూడుసార్లు మంత్రివర్గ విస్తరణ జరిగితే మొదటిసారి 11 మందికి, రెండోసారి ముగ్గురికి, మూడోసారి ఒక్కరికి ఛాన్స్ దక్కింది. అయితే ఈ సారి మాత్రం ఒకరో ఇద్దరిని తప్పిస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో కొందరిలో టెన్షన్ మొదలైందని టాక్. ఇదిలా ఉంటే కొత్తగా ఇద్దరికి క్యాబినెట్ బెర్త్ దక్కనుంది. (Revanth Reddy)

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాబోతోంది. పాలన లోపాలు, చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉండాలనే దానిపై లోతుగా అధ్యయనం జరుగుతోందట. ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని సర్కార్ భావిస్తుందట. ఇందులో భాగంగానే పూర్తిస్థాయి క్యాబినెట్ను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తున్నట్లు వినికిడి.

ఈ సారి అధిష్టానం మార్క్

లేటెస్ట్‌గా అజారుద్దీన్‌ను మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత మంత్రి పదవిని ఆశించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు సివిల్ సప్లై ఛైర్మన్‌గా పదవిని కట్టబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ముఖ్య సలహాదారుగా నియమించారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది కొత్తగా మంత్రి పదవులను ఆశిస్తున్న వారు ఉన్నారు.

క్యాబినెట్ షఫ్లింగ్‌లో ఈ సారి అధిష్టానం మార్క్ ఉంటుందని వాదన కూడా ఉంది. 2029 ఎన్నికలే టార్గెట్గా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోందట. ఇందుకోసం ముందుగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్నారని టాక్. దీనికి తోడు కచ్చితంగా కొన్ని శాఖలను సీనియర్లకు అప్పగించి..వాటిని పర్యవేక్షించాలని సీఎం భావిస్తున్నారట. అందుకే మంత్రుల శాఖలు కూడా మారనున్నాయని చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే..కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. క్యాబినెట్ బెర్త్ ఖాయమని భావించాకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారట. ఇక పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి దక్కితే.. అదే సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్‌కు పీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

త్వరలోనే బ్యూరోక్రాట్స్‌లో  భారీ మార్పులు జరగబోతున్నాయనే టాక్ అధికారులను టెన్షన్ పెడుతుంటే.. క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం అమాత్యుల్లో ఆందోళన కలిగిస్తోందట. అందలమెక్కేదెవరో? ఎవరి పదవి ఊస్ట్ అవుతుంతో వేచి చూడాలి మరి.