Revanth Reddy : ఎన్టీఆర్‌కి, కేటీఆర్‌కి నక్కకి కుక్కకి ఉన్నంత తేడా ఉంది : రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటుందని..ఎన్టీఆర్ సమాధిని తొలగించాలని చూసింది కేసీఆర్ అంటూ ఆరోపించారు.డోమస్టిక్ ఎయిర్ లైన్స్ కి ఎన్టీఆర్ పేరు తొలగించి అవమానించారని అన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరును వాడుకుంటోంది అంటూ మండిపడ్డారు.

revanth reddy
revanth reddy.. Minister KTR : తారక రామారావు పేరులోనే పవర్ ఉందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ఎన్టీఆర్ పేరు నా పేరు ఒక్కటే అని కేటీఆర్ మురిసిపోతున్నాడని..ఎన్టీఆర్ కి కేటీఆర్ కి నక్కకి కుక్కకి ఉన్నంత తేడా ఉంది అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ విజయాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు అన్నారు.
ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌లో ఏర్పాటుచేసినఎన్టీఆర్ పార్కును ప్రారంభించన సందర్భంగా మంత్రి కేటీఆర్ నందమూరి తారక రామారావుపై ప్రశంసల వర్షం కురిపించారు. భారతదేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉండిపోతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తు..బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటుందని..ఎన్టీఆర్ సమాధిని తొలగించాలని చూసింది కేసీఆర్ అంటూ ఆరోపించారు.డోమస్టిక్ ఎయిర్ లైన్స్ కి ఎన్టీఆర్ పేరు తొలగించి అవమానించారని అన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరును వాడుకుంటోంది అంటూ మండిపడ్డారు.
Minister KTR: ఎన్టీఆర్‌కు సాధ్యంకానిది.. ఆయన శిష్యుడు కేసీఆర్ చేయబోతున్నారు
ఎన్టీఆర్ పేరు నా పేరు ఒక్కటే అని కేటీఆర్ మురిసిపోతున్నారని..ఎన్టీఆర్ కి కేటీఆర్ కి నక్కకి కుక్కకి ఉన్నంత తేడా ఉంది అంటూ ఎద్దేవా చేశారు.ఎన్టీఆర్ పార్టీని లేకుండా చేయాలని చూసింది కేసీఆర్ అని..ఎన్టీఆర్ తో పోల్చుకోవాలని చూస్తే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది అని అన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న ఒక్కడు కూడా ఎన్టీఆర్ తో పోల్చుకోవడానికి అర్హుడు కాదు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పనైపోయిందని..ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు.
టిక్కెట్ ల ప్రకటన నాటికి బీజేపీ, బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్ లో చేరిక ఉంటుందన్నారు.బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ లు మా పార్టీ లోకి వస్తున్నారంటేనే మా బలం ఏంటో అర్దం అవుతుందని అన్నారు.బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదని జోస్యం చెప్పారు.రాష్ట్రంలో 19% ఓట్లు అన్ డిసైడ్ లో ఉన్నాయి..ఇందులో మెజారిటీ ఓటు షేర్ మాకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతోనే బీఆర్ఎస్ ఉచితాలు ప్రకటించేస్తోందని..ఆ భయంతోనే ఉచిత సిలిండర్లు ,సన్న బియ్యం రేషన్ , రైతు లకు పెన్షన్ లాంటి హామీ లు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారని విమర్శించారు.
BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?
కాంగ్రెస్ లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీగా నేను కొట్లాడుతానని అన్నారు.సర్వేలో ఓసిల కంటే బీసీలకు రెండు శాతం తక్కువ ఉన్న ..బీసీలకే టిక్కెట్ ఇస్తాం అని తెలిపారు.తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీలు అడగడంలో తప్పులేదు అన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే మేము ఎక్కువ ఇస్తామని తెలిపారు.