Revanth Reddy: కర్ణాటకలో సిద్ధరామయ్యకూ కోరిన సీటు ఇవ్వలేదు.. ఇక తెలంగాణలో..: రేవంత్ రెడ్డి

పీసీసీ అధ్యక్షుడినయినప్పటికీ ఎన్నికల్లో తన ఇష్టమైన స్థానం నుంచి పోటీ చేసే విషయం కూడా తన చేతుల్లో ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy: కర్ణాటకలో సిద్ధరామయ్యకూ కోరిన సీటు ఇవ్వలేదు.. ఇక తెలంగాణలో..: రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ (Telangana) ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

” పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర 1,000 కిలోమీటర్లకు చేరుకోవడంతో అభినందిస్తూ తీర్మానం చేశాం. ఎన్నికల్లో ఏ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం ఎవరి చేతుల్లోనూ ఉండదు. కర్ణాటక లో సిద్ధరామయ్యకూ కోరిన సీటు ఇవ్వలేదు.. సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీటు.

పీసీసీ అధ్యక్షుడిగా నా సీటు కూడా నా చేతుల్లో ఉండదు. పార్టీ సర్వే చేసి చెప్పిన చోట పోటీ. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. అందరూ పార్టీ కోసం పని చేయాలి. ఏ మాత్రం నిర్లక్షం చేయవద్దు. కర్ణాటకలో బోస్ రాజు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి రాకపోయేదేమో.. పార్టీ నిర్ణయానికి కట్టుబడటంతో..

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రి పదవి వచ్చింది. వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రెటరీలు వారు ఇన్‌ఛార్జిలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒక నివేదిక పంపాలి. ఈ ఆరునెలలు కష్టపడి పనిచేయాలి. పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయి. సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది ” అని రేవంత్ రెడ్డి చెప్పారు.

సమావేశంలో చేసిన నాలుగు తీర్మానాలు ఇవే

ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్ లను అభినందిస్తూ తీర్మానం

కొత్తగా నియమితులైన సెక్రెటరీలను అభినందిస్తూ తీర్మానం

బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని తీర్మానం

సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క పాదయాత్ర 1000 కి.మీ. పూర్తయిన సందర్భంగా వారిని అభినందిస్తూ తీర్మానం

Mekapati Chandrasekhar Reddy : ఆనం బాటలో మేకపాటి .. టీడీపీలో చేరుతున్నానంటూ సంచలన ప్రకటన