Hyderabad: హైదరాబాద్ రోడ్లపై రయ్‌రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు.. ఆ ఏరియాల్లో నో సిగ్నల్స్.. జీహెచ్ఎంసీ చకచకా ఏర్పాట్లు

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతూ సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది.

Hyderabad: హైదరాబాద్ రోడ్లపై రయ్‌రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు.. ఆ ఏరియాల్లో నో సిగ్నల్స్.. జీహెచ్ఎంసీ చకచకా ఏర్పాట్లు

Traffic free roads

Updated On : February 15, 2025 / 10:01 AM IST

Hyderabad: హైదరాబాద్ నగరంలోని రహదారులపై ప్రయాణించాలంటే సిగ్నళ్లు దాటుకొని వెళ్లాలి. ప్రతీ కూడలి వద్ద సిగ్నళ్లు ఏర్పాటు చేయడంతో సిగ్నల్ పడేవరకు ఆగి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికితోడు ట్రాఫిక్ సమస్య నిత్యం వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. రాజధానిలోని ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతూ సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. హెచ్-సిటీ ప్రాజెక్టు కింద రహదారుల పనులకు శ్రీకారం చుట్టనుంది.

Also Read: Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంచార్జ్.. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్.. ఎవరీ మీనాక్షి..

హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా అండర్ పాస్ లు, ప్లై ఓవర్లు నిర్మాణాలు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన రూ.7,032 కోట్ల విలువైన 38 పనులకు పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.2,373 కోట్లతో వివిధ పనులకు మొదటి దశ కింద టెండర్లు పిలిచేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ పనులన్నీ రెండు మూడేళ్లలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

 

కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ, అండర్ పాస్ లు, ప్లై ఓవర్లు నిర్మాణం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్, చెక్ పోస్టు కూడలిలో, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు చౌరస్తాలో, రోడ్డు నెం. 45 కూడలిలో, ఫిల్మ్ నగర్ కూడలిలో, మహారాజ అగ్రసేన్ కూడలిలో, క్యాన్సర్ ఆస్పత్రి కూడలిలో ప్లై ఓవర్లు, అండర్ పాస్ లు రానున్నాయి. పార్కు చుట్టూ చేపట్టే ఆరు కూడళ్ల అభివృద్ధికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ భూసేకరణ ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు.

Also Read: BJP: తెలంగాణ బీజేపీలో చిచ్చుపెట్టిన జిల్లా అధ్యక్షుల నియామకం.. పార్టీకి ఝలక్‌ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్.. నెక్స్ట్‌ ఏంటి?

ప్లై ఓవర్లు, అండర్ పాస్ లు చేపట్టే ప్రాంతాలు..
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ పార్కు, ముగ్ధ జంక్షన్లు, రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, కేన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్, ఫాక్స్ సాగర్ సర్ ప్లస్ నాలా. వీటి పొడవు దాదాపు 13.5 కిలో మీటర్లు ఉంటుందని అంచనా వేయగా.. దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.

 

రహదారుల విస్తరణ, అభివృద్ధి జరిగే ప్రాంతాలు..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం – గచ్చిబౌలి జంక్షన్, అంజయ్య నగర్ -రామ్కీ టవర్ రోడ్డు.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అజీమ్ హోటల్ – చర్చిగేట్ (సోహెబ్ హోటల్ -బాలాపూర్ రోడ్డ), లక్కీస్టార్ హోటల్ -హఫీజ్ బాబాన గర్ (వయా పూల్ బాగ్), తులసీనగర్ -గౌస్ నగర్, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్ – బార్కాస్ రోడ్ (వయా చాంద్రాయణగుట్ట పీఎస్). వీటి పొడవు 6.5 కిలో మీటర్లు ఉంటుంది.