TS RTC : ఆర్టీసీ ఉద్యోగులు హమాలీ పనులు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందితో హమాలీ పనులు చేయించడం చర్చనీయాంశమైంది. దీంతో.. పార్సిల్, కొరియర్ సర్వీస్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఆర్టీసీ యూనియన్లు.

Tsrtc
Hamali Works : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందితో హమాలీ పనులు చేయించడం చర్చనీయాంశమైంది. దీంతో.. పార్సిల్, కొరియర్ సర్వీస్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఆర్టీసీ యూనియన్లు. చాలామంది కండక్టర్లు, డ్రైవర్లు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవిన వాళ్లు ఉన్నారరని.. వాళ్లతో హమాలీ పనులను చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యూనియన్ల నేతలు.
హమాలీ పనులను చేయకపోతే.. కొందరు అధికారులు ఉద్యోగులు, సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులనుతో హమాలీ పనులను చేయించవద్దని డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘాలైన టీఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీజేఎంయూల నేతలు.. సంస్థ ఎండీ సునీల్ శర్మకు లేఖలు రాశారు.
Read More :Pfizer COVID-19 Vaccine : ఫైజర్ వ్యాక్సిన్.. ఫ్రిడ్జ్‌లో నెల వరకు స్టోర్ చేయొచ్చు..