Sankranti Festival Rush : పండుగ ఎఫెక్ట్… ఉప్పల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది.

Sankranti Festival Rush : పండుగ ఎఫెక్ట్… ఉప్పల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్

Updated On : January 11, 2025 / 6:04 PM IST

Sankranti Festival Rush : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారు హైదరాబాద్ ప్రజలు. దీంతో ఉప్పల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులో బస్ స్టేషన్లన్నీ రద్దీగా మారాయి. ఉప్పల్ చౌరస్తా మొత్తం వాహనాలతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా పట్నం వాసులు అంతా పల్లెబాట పట్టారు.

ప్రయాణికులతో రద్దీగా మారిన బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు..
ప్రతీ ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎల్బీ నగర్ చౌరస్తా, జేబీఎస్ బస్టాండ్, కూకట్ పల్లి, అమీర్ పేట్.. అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తార్నాక నుంచి ఉప్పల్ చౌరస్తా వచ్చే రూట్ మొత్త వాహనాలతో కిటకిటలాడుతోంది. ఉప్పల్ చౌరస్తా నుంచి వరంగల్, హన్మకొండ, జనగాం, సూర్యాపేట.. ఈ రూట్ ద్వారా బస్సులు వెళ్తుంటాయి.

సంక్రాంతి పండగ సెలవులు రావడంతో హైదరాబాద్ నగర ప్రజలు సొంతూళ్లకు పయనం అయ్యారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. 6వేల 432 బస్సులు నడుపుతోంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది.

Also Read : పండుగ పూట పెను విషాదం.. కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో ఐదుగురు యువకులు గల్లంతు..

పల్లె బాట పట్టిన పట్నం వాసులు..
ఏకంగా వారం రోజుల పాటు వరుస సెలవులు రావడంతో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు సొంతూళ్లకు పయనం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి ముఖ్యమైన పండుగ. దీంతో పట్నం వాసులు పల్లె బాట పట్టారు.

Traffic Jam

Traffic Jam (Photo Credit : Google)

ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్న పోలీసులు..
మరోవైపు ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దేందుకు అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే, పెద్ద సంఖ్యలో బస్సులు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్ చౌరస్తా కొంత చిన్నగా ఉంటుంది. దాంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెబుతున్నారు.

విధుల్లో ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, హోమ్ గార్డులు..
ఉప్పల్ చౌరస్తా చిన్నగా ఉండటంతో పాటు నాలుగు కూడళ్లు ఉంటాయి. రామంతాపూర్ వెళ్లే కూడలి, ఎల్బీ నగర్, తార్నాక, వరంగల్ హైవే రోడ్ కావచ్చు.. ఈ నాలుగు కూడళ్లతో కూడిన హైవే కావడంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

ప్రయాణికులతో బస్సు ఫుల్ అవగానే.. అక్కడి నుంచి ఆ బస్సును పంపేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, హోమ్ గార్డులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం విధుల్లో ఉన్నారు. మొత్తం రూట్లన్నీ క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తున్నా.. హెవీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.

Also Read : సంక్రాంతి పండుగ వేళ భారీ దందాకు తెరలేపిన ప్రైవేటు ట్రావెల్స్.. ప్రయాణికుల ఆందోళన