కరోనా భయంతో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య

కరోనా భయంతో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య

Updated On : January 9, 2021 / 10:32 AM IST

SBI probationary officer sucide: కరోనా వ్యాధి సోకుతుందేమో అనే భయంతో మానసిక ఆందోళనకు గురైన బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన రుబ్బ వాణి అనే యువతి, ఎస్బీఐ లో ప్రోబేషనరీ ఆఫీసర్ గా కరీంనగర్ లోని మంకమ్మతోట బ్రాంచిలో పని చేస్తోంది. స్ధానిక టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అద్దెకు ఉంటోంది.

కరోనా వైరస్ సోకి గత నెలలో ఆమె తండ్రి మరణించారు. తల్లికి పాజిటివ్ అని తేలింది. దాంతో మానసిక వేదనకు గురైన వాణి ఉరివేసుకుని తనువు చాలించింది. కరోనా భయం, తండ్రి మృతి తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ లో పేర్కోంది.