TS High Court : తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కోలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది.

TS High Court : తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు

TS High Court

Updated On : February 2, 2022 / 12:17 PM IST

TS High Court :  తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కోలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. కోలీజియం సిఫార్సు చేసిన న్యాయవాదుల్లో కాసోజు సురేందర్, చాడ విజయ్ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాజి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్, నాచరాజు శ్రావణ్ కుమార్ వెంకట్ ఉన్నారు.
Also Read : Statue Of Equality : సమతాస్ఫూర్తి.. రామానుజ మూర్తి..! గురువారం జరిగే కార్యక్రమాల వివరాలు
అదే విధంగా ఐదుగురు న్యాయాధికారుల పదోన్నతికి కూడా కొలీజియం సిఫార్స్ చేసింది. పదోన్నతికి సిఫార్స్ చేసిన వారిలో జీ.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎం.సంతోష్ రెడ్డి, డీ.నాగార్జున ఉన్నారు.