స్కూల్స్ తెరుచుకోవచ్చు, తెలంగాణ విద్యాశాఖ అనుమతి

schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రేపటి(ఫిబ్రవరి 24,2021) నుంచి మార్చి 1 లోపు ఎప్పుడైనా క్లాసులు ప్రారంబించుకోవచ్చని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ తరగతుల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు.
అయితే, విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అంశంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. స్కూలుకు వచ్చే విద్యార్థులు కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.