Telangana Secretariat : సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి హల్ చల్.. జిరాక్స్ సెంటర్ లో చేసిన ఫేక్ ఐడీతో బిల్డప్..

అనుమానం రావటంతో అంజయ్యను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. సైఫాబాద్ పోలీసులకు అతడిని అప్పగించారు.

Telangana Secretariat : సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి హల్ చల్.. జిరాక్స్ సెంటర్ లో చేసిన ఫేక్ ఐడీతో బిల్డప్..

Updated On : February 6, 2025 / 9:55 PM IST

Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్ చల్ చేస్తున్నారు. రోజుకో ఫేక్ ఉద్యోగిని పట్టుకుంటున్నారు సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది. తాజాగా మరో ఫేక్ ఉద్యోగిని పట్టుకున్నారు. తహసీల్దార్ పేరుతో కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి సెక్రటేరియట్ కు వచ్చారు. తహసీల్దార్ స్టిక్కర్ వాహనంతో సెక్రటేరియట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అనుమానం రావటంతో అంజయ్యను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. సైఫాబాద్ పోలీసులకు అతడిని అప్పగించారు. అంజయ్య నుంచి ఫేక్ ఐడీ స్వాధీనం చేసుకున్నారు. జిరాక్స్ సెంటర్ లో ఫేక్ ఐడీ తయారు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. ఫేక్ ఉద్యోగి దందాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Also Read : ఎమ్మెల్యేల సీక్రెట్‌ మీటింగ్‌తో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్.. అంతా సెట్‌ అయ్యేనా..?

నకిలీ ఉద్యోగుల భరతం పడుతున్నారు..
సచివాలయంలో నకిలీ ఉద్యోగుల భరతం పడుతున్నారు. నకిలీ ఐడీ కార్డులతో చెలామణి అవుతూ సచివాలయంలో దందాలు చేస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. తాజాగా అంజయ్య అనే వ్యక్తి తహసీల్దార్ ఐడీతో రోజూ సచివాలయంలోకి వస్తున్నట్లు గుర్తించారు. అయితే, అతడిపై సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బందికి ఎందుకో అనుమానం వచ్చింది. దాంతో అతడిపై నజర్ పెట్టారు.

అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా వారికి షాక్ తగిలినంత పనైంది. అతడు ఫేక్ అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు నకిలీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.

గత కొంత కాలంగా తహసీల్దార్ స్టిక్కర్ కలిగున్న కారుతో అతడు సెక్రటేరియట్ లోపలికి వెళ్తున్నాడు. సచివాలయం అంతా తిరుగుతున్నాడు. మంత్రులు, ప్రిన్సిపల్ సెకట్రరీల చాంబర్ లలో తిరుగుతున్నాడు. అతడిపై పూర్తిగా నిఘా పెట్టిన సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది.. ఇవాళ ఎట్టకేలకు అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు.

Also Read : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాక్..! షోకాజ్ నోటీసులు జారీ..

జిరాక్స్ సెంటర్ లో ఫేక్ ఐడీ తయారు చేసి తహశీల్దార్ అంటూ బిల్డప్..
ఈ నేపథ్యంలో అంజయ్య నిజస్వరూపం బయటపడింది. అతడు ఫేక్ అని తేలింది. ఓ జిరాక్స్ సెంటర్ లో ఫేక్ ఐడీ తయారు చేసి తాను తహశీల్దార్ అంటూ బిల్డప్ ఇచ్చాడు. ఫేక్ ఐడీతో అతడు దందాలు చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. సైఫాబాద్ పోలీసులు అంజయ్య పై కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు.

గత రెండు రోజుల క్రితమే సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది.. ఫేక్ ఉద్యోగిని పట్టుకున్నారు. ఇది మరువక ముందే మరో నకిలీ ఉద్యోగి పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఎవరైనా.. నకిలీ ఐడీ కార్డుతో సచివాలయంలోకి వస్తే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

రోజూ దాదాపు 5వేల మందికి పైగా తెలంగాణ సెక్రటేరియట్ కు వస్తుంటారు. ఇలాంటి ఫేక్ ఐడీలతో వస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. నకిలీ ఉద్యోగుల వ్యవహారం వెలుగు చూస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది సచివాలయానికి వచ్చే ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఐడీ కార్డులను చెక్ చేస్తున్నారు. ఫేక్ అని తేలితే మాత్రం తాట తీస్తున్నారు.