సికింద్రాబాద్, నాగ‌ర్‌సోల్‌ మధ్య స్పెషల్ ట్రైన్లు.. టైమ్, తేదీలు ఇవే..

వేసవి ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, నాగ‌ర్‌సోల్‌ మధ్య స్పెషల్ ట్రైన్లు నడపనుంది.

సికింద్రాబాద్, నాగ‌ర్‌సోల్‌ మధ్య స్పెషల్ ట్రైన్లు..  టైమ్, తేదీలు ఇవే..

Secunderabad Nagarsol special trains: వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణాల రద్దీ పెరిగింది. నగరాల నుంచి సొంతూళ్లకు పయమవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోతోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా సికింద్రాబాద్, నాగ‌ర్‌సోల్‌ మధ్య స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉన్న రోజులో ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయని తెలిపింది. తిరుపతి, మచిలీపట్నం మధ్య కూడా స్పెషల్ రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 17, 24.. మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైళ్లు(07517) బయలుదేరతాయి. మరుసటి ఉదయం 8 గంటలకు నాగ‌ర్‌సోల్‌ చేరుకుంటాయి.

నాగ‌ర్‌సోల్‌ నుంచి ఏప్రిల్ 18, 25.. మే 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10 గంటలకు స్పెషల్ ట్రైన్లు(07518) బయలుదేరతాయి. మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని సూచించింది.

Also Read: ఎంత ధైర్యం.. దూసుకొచ్చిన పులితో సెల్ఫీ తీసుకున్న యువకుడు.. పుష్ప కన్నా గ్రేట్ అంటూ..

 

తిరుపతి మచిలీపట్నం మధ్య స్పెషల్ రైళ్ల వివరాలు
తిరుపతి నుంచి ఏప్రిల్ 14, 21, 28.. మే 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 15, 22, 29.. మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.20 గంటలకు తిరుపతికి రీచ్ అవుతుంది.