రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై గెజిట్‌ కొట్టివేత

MLCs Gazette: కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై గెజిట్‌ కొట్టివేత

Kodandaram, Amir Ali Khan MLCs Gazette

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దాన్ని కొట్టివేస్తూ.. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ హైకోర్టు సూచించింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.

గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటీషన్‌పై హైకోర్ట్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్‌కు తెలపాలని చెప్పింది.

కాగా, తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇటీవలే నియమితులైన విషయం తెలిసిందే. శారి నియామకాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఆమోదించారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగిరింది.

దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో కొన్ని రోజులుగా విచారణ జరిగింది. ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని వారు సవాల్ చేశారు. దీనిపైనే ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Kavitha: అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం: కల్వకుంట్ల కవిత