Shabbir Ali: ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే: కాంగ్రెస్

సీఎం కేసీఆర్ ఆగస్టు 21న అభ్యర్థుల జాబితా ప్రకటించారని, గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు.

Shabbir Ali: ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే: కాంగ్రెస్

షబ్బీర్ అలీ

Updated On : September 1, 2023 / 4:11 PM IST

Shabbir Ali – TPCC: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై కాంగ్రెస్ (Congress) నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ఆగస్టు 21న అభ్యర్థుల జాబితా ప్రకటించారని, గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. 26 నుంచి కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ లెటర్ పాడ్స్ మీద కేసీఆర్‌కి మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు.

ఎన్నికల కమిషన్‌ని కలిసి, ఆధారాలను అందిస్తామని చెప్పారు. కవిత ఎమ్మెల్సీ అయ్యుండి, తప్పు అని చెప్పకుండా ఆ విషయంపై ట్వీట్ చేయడం మంచిది కాదని అన్నారు. అక్కడి సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సస్పెండ్ చేయాలని, కవితకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. తాము చట్టపరంగా ముందుకు వెళతామని అన్నారు.

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ… కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పారని అన్నారు. మాచారెడ్డి మండలంలోని కొన్ని గ్రామాలు సర్పంచ్, ఉప సర్పంచ్, లెటర్ హెడ్ లపై ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారని గుర్తు చేశారు. ఇది ఎన్నికల కోడ్‌కి విరుద్ధమని తెలిపారు.

Talasani Srinivas: ఎన్నికలతో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏం సంబంధం?: మంత్రి తలసాని