Siddipet : సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా ?

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఆయన బీఆర్ కే భవన్ కు చేరుకోవడంతో రాజీనామా చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి

Siddipet : సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా ?

Siddipet

Updated On : November 15, 2021 / 1:57 PM IST

Siddipet Collector : సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఆయన బీఆర్ కే భవన్ కు చేరుకోవడంతో రాజీనామా చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ ను కలవడానికి ప్రస్తుతం ఆయన వెయిట్ చేస్తున్నారు. సీఎస్ వచ్చిన అనంతరం ఆయనతో భేటీ అయి..చర్చించనున్నట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డి రాజీకీయవర్గాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

Read More: T20 World Cup : ఆసీస్ క్రికెటర్ల సంబరాలు, బూటులో కూల్ డ్రింక్ పోసుకుని..తాగారు

2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కూడా హాజరయ్యారు. సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఇటీవలే చేసిన పలు వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామాలు సంభవించిన సంగతి తెలిసిందే. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిని విపక్షాలు క్యాష్ చేసుకుని ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించాయి