సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్‌గా మొత్తం ఎన్ని కోట్ల రూపాయలంటే? భట్టి విక్రమార్క నుంచి ప్రకటన వచ్చేసింది..
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రతి సారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా బోనస్ ప్రకటిస్తోందని అన్నారు.

Bhatti Vikramarka
Singareni: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళి బోనస్‌గా రూ.400 కోట్లు ప్రకటించింది. ఇవాళ ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రతి సారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా బోనస్ ప్రకటిస్తోందని అన్నారు. సింగరేణి కార్మికులకు భట్టి విక్రమార్క దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “ఖమ్మం జిల్లా నుంచి మొదలైంది సింగరేణి ప్రస్తానం. ఇప్పుడు రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదిగింది. థర్మల్ పవర్ ప్రాజెక్టుకు, ఇతర ఇండస్ట్రీలకు పనికివచ్చే బొగ్గును సరఫరా చేస్తోంది” అని కొనియాడారు.
అందుకే రేపు బంద్: భట్టి విక్రమార్క
కాగా, బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ తీరు బాగోలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. “42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాకుండా అడ్డుపడుతుంది బీజేపీనే. బీసీ బిల్లు విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న విధానం దేశం మొత్తం చూస్తోంది. బీసీ బిల్లు విషయంలో హైకోర్ట్, సుప్రీంకోర్టుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కోట్లాడుతోంది.
బీసీ బిల్లు ఆమోదం కోసం మా వైపు నుంచి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. రేపు జరిగే బంద్ బీసీ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నందుకే. బీసీ బిల్లు విషయంలో బీజేపీ అడ్డుపడడమే కాకుండా అడ్డగోలుగా మాట్లాడుతోంది. బీసీలు అంత అమాయకులు కాదు. బీజేపీ డ్రామాలను గమనిస్తూన్నే ఉన్నారు. రేపు జరిగే బంద్‌ను జయప్రదం చేయండి” అని అన్నారు.