Slot Booking: ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో 25 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఇకపై చెట్ల కింద నిరీక్షణకు దశల వారీగా తెరదించుతామన్నారు మంత్రి పొంగులేటి.

Slot Booking: స్లాట్ బుకింగ్ కు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రేపటి (మే 12) నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులోకి రానుందని తెలిపారు. అధిక రద్దీ ఉన్న కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం చేపడతామన్నారు. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ అమలు చేస్తామన్నారు. ఇకపై చెట్ల కింద నిరీక్షణకు దశల వారీగా తెరదించుతామన్నారు మంత్రి పొంగులేటి.
రేపటి నుంచి స్లాట్ బుకింగ్ అమలు కానున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..
హైదరాబాద్ ఆర్.ఓ. ఆఫీస్ సౌత్
నారపల్లి
ఘట్ కేసర్
మల్కాజిగిరి
ఉప్పల్
కాప్రా
బీబీనగర్
సిద్దిపేట్
సిద్దిపేట్ రూరల్
గజ్వేల్
మంచిర్యాల
పెద్దపల్లివరంగల్ ఆర్.ఓ. ఆఫీస్
జనగాం
ఘన్ పూర్
నర్సంపేట
కల్వకుర్తి
నారాయణపేట
మహేశ్వరం
రంగారెడ్డి ఆర్.ఓ. ఆఫీస్
షాద్ నగర్
ఫరూక్ నగర్వనస్థలిపురం
శేరిలింగంపల్లి.
Also Read: ఇందిరమ్మ హౌసింగ్ స్కీం.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రేపటి నుంచే వారికి మంజూరు పత్రాలు
ప్రస్తుతం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇకపై ఆ బాధ లేకుండా కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల అమల్లోకి తెచ్చారు. రేపటి నుంచి మరికొన్ని చోట్ల అమల్లోకి రానుంది.
స్లాట్ బుకింగ్ తో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మరింత ఈజీ అయ్యిందని, జస్ట్ 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదంది. అవినీతికి ఆస్కారం లేకుండా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అమల్లోకి వచ్చింది. దశల వారిగా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ ను అమలు చేస్తోంది ప్రభుత్వం.