40 ఏళ్ల ప్రియురాలి ప్రాణం తీసిన ప్రియుడు.. ఉప్పల్ భగాయత్‌లో ఘోరం

మృతురాలి శరీరంపై దుస్తులు కూడా లేకపోవడంతో ఈ హత్య..

40 ఏళ్ల ప్రియురాలి ప్రాణం తీసిన ప్రియుడు.. ఉప్పల్ భగాయత్‌లో ఘోరం

హైదరాబాద్ శివారులోని ఉప్పల్ భగాయత్‌లో ఓ మహిళను ఆమె ప్రియుడు కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. మృతురాలి శరీరంపై దుస్తులు కూడా లేకపోవడంతో ఈ హత్య అనేక అనుమానాలకు దారి తీస్తోంది. మృతురాలి పేరు కొమ్మవారి మంజుల(40)గా పోలీసులు గుర్తించారు.

ఆమె ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తుంది. ఆమెతో రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి (47) అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ ఉంటుంది. అందులోనే డైరెక్టర్ మంజుల వద్ద చంద్రమౌళి పనిచేస్తున్నాడు.

మూడు నెలల నుంచి మరో వ్యక్తితో మంజుల సన్నిహితంగా ఉందని చంద్రమౌళి పగ పెంచుకున్నాడు. అంతేగాక, చంద్రమౌళి దగ్గర రూ.28 లక్షలు తీసుకుని మంజుల తిరిగి ఇవ్వడం లేదని తెలిసింది. మద్యం సేవించి ఆదివారం రాత్రి సమయంలో ఉప్పల్ భగాయత్‌కు తీసుకవచ్చి కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు చంద్రమౌళి. అనంతరం ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి చంద్రమౌళి లొంగిపోయాడు. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: నడిరోడ్డుపై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి