Sonia Gandhi : అమరుల ఆశయాలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది : సోనియా గాంధీ
Sonia Gandhi : తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్‌లో హామీ ఇచ్చానని అన్నారు.

Sonia Gandhi Message to Telangana People
Sonia Gandhi : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. తెలంగాణలో అమరులైన వారికి నివాళులు అర్పించిన ఆమె మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్‌లో హామీ ఇచ్చానని అన్నారు.
Read Also : AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
సవాళ్లు ఎదురైనా తెలంగాణ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. అమరుల ఆశయాలను మా ప్రభుత్వం నెరవేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవంతో పాటు ప్రేమను ఇచ్చారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడమే నా కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోదని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నానని సోనియా చెప్పారు.
తెలంగాణలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు సీఎం, మంత్రులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించగా.. జాతీయ జెండాను సీఎం రేవంత్ ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గేయం జాతికి అంకితం చేశారు.
Read Also : ఎగ్జిట్‌పోల్స్ తర్వాత స్పష్టత వస్తుందనుకుంటే మరింత గందరగోళం