కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అల్లు అర్జున్ మామ, పలువురు బీఆర్ఎస్ నేతలు
వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..

Congress
Telangana Congress: బీఆర్ఎస్ కీలక నేతలు పలువురు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా సినీనటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునితా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి సమావేశమయ్యారు.
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు హస్తం పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలు చర్చించారు. వారిని లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం పార్టీలో నీలం మధు చేరారు.
Also Read: కుర్చీ మడతపెట్టి చూపించిన నారా లోకేశ్.. సీటు లేకుండా చేస్తామని జగన్‌కు వార్నింగ్